
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ అయిన పాపా జాన్స్ ఇండియాలోకి తిరిగి రాబోతుంది. సుమారు ఎనిమిది ఏళ్ల తర్వాత ఈ అమెరికా కంపెనీ అక్టోబర్ 2025లోగ బెంగళూరులో మొదటి స్టోర్, రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా 650 స్టోర్‌లను స్థాపించాలని చూస్తుంది.
ఈ రిఎంట్రీ భారతదేశ పిజ్జా మార్కెట్‌లో మరింత పోటీ పెంచనుంది, ప్రస్తుతం 2,200 కంటే పైగా స్టోర్లతో డొమినోస్ పిజ్జా ఆధిపత్యం చెలాయిస్తుండగా, తరువాత దేవయాని ఇంటర్నేషనల్ అండ్ సఫైర్ ఫుడ్స్ ఫ్రాంచైజీల ద్వారా సుమారు వెయ్యి స్టోర్లను పిజ్జా హట్ నడుపుతుంది. మార్కెట్లో పోటీ వాతావరణం కూడా వేడెక్కుతుండటంతో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ నిర్వహిస్తున్న డొమినోస్ రాబోయే 3 ఏళ్లలో మరో వెయ్యి స్టార్లను ప్రారంభించాలని చూస్తుంది. అయితే లిటిల్ సీజర్స్ రాబోయే కాలంలో 100 స్టోర్ల ప్లాన్ తో గత నెల ఇండియాలోకి అడుగుపెట్టింది.
సర్వీస్ సరిగ్గా లేని కారణంగా పాపా జాన్ 2017లో ఇండియా నుండి వైదొలగింది. ఈసారి భారతదేశంలో పాపా జాన్ కార్యకలాపాలకు పల్సర్ క్యాపిటల్ & యుఎఇకి చెందిన పిజెపి ఇన్వెస్ట్‌మెంట్స్ గ్రూప్ నాయకత్వం వహిస్తున్నాయి, అంతేకాదు ఇవి రెండు మాస్టర్ ఫ్రాంచైజీలుగా పనిచేస్తాయి.
ALSO READ : ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..
KFC పనీర్ జింజర్ బర్గర్‌ను, డొమినోస్ చికెన్ టిక్కా పిజ్జాను, సబ్‌వే పొటాటో-ప్యాటీ శాండ్‌విచ్‌ను అందిస్తుంది. ఈ విధానాన్ని ఫాలో అవుతూ పాపా జాన్ కూడా మెనూను భారతీయ అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవాలని చుస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే డవ్ సబ్బుల తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్, బీర్ల కంపెనీ హీనెకెన్ వంటి పెద్ద సంస్థలు భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభాను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెడుతున్నాయి. ఇలాంటి కంపెనీలని చూసి పల్సర్ క్యాపిటల్ కూడా భారతదేశ భవిష్యత్తుపై నమ్మకంతో పెట్టుబడి పెడుతోంది.