
సింగర్ శ్రీరామ చంద్ర లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘పాపం పసివాడు’. గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. లలిత్ కుమార్ దర్శకుడు. జోస్ జిమ్మీ సంగీతాన్ని అందించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ ‘లవ్, కామెడీ కలగలిసిన ఈ సిరీస్ రోలర్ కోస్టర్‌లా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకముంది.
టీమ్ అందరికీ బెస్ట్ విషెస్’ అని చెప్పాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ ‘యాంకర్‌గా ‘ఆహా’లో జర్నీ ప్రారంభించి, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లో నటించాను. అందమైన ప్రేమ కథతో పాటు ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.
టీమ్ అంతా పాల్గొన్నారు. ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్‌అయ్యే కుర్రాడి జీవితంలో ముగ్గురు అమ్మాయిల వల్ల ఎలాంటి గందరగోళం ఏర్పడిందనేది మెయిన్ కాన్సెప్ట్. ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.