వర్షాల ఎఫెక్ట్: బయట పేపర్ లీకులు.. లోపల వాటర్ లీకులు

వర్షాల ఎఫెక్ట్: బయట పేపర్ లీకులు.. లోపల వాటర్ లీకులు

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షం కురిసింది. ఒకానొక దశలో ఒక గంటలోనే 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ఢిల్లీ నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరదలతో ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. 

మరోవైపు ఈ భారీ వర్షాలకు పార్లమెంట్‌ లాబీలో కూడా వాటర్‌ లీక్‌లు ఏర్పడ్డాయి. కాగా కేంద్రం ఇటీవలే కొత్తగా నిర్మించి ప్రారంభించిన పార్లమెంట్‌ భవనంలో అప్పుడే రూఫ్‌ నుంచి వర్షం నీరు లీకవుతుండటంతో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పార్లమెంట్‌ లాబీలో వాటర్‌ లీక్‌ అవుతున్న దృశ్యాలను కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ ఎక్స్‌ లో షేర్‌ చేయగా పలువురు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు జరుగుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇటీవల రాష్ట్రపతి ఉపయోగించిన పార్లమెంట్ లాబీలో వర్షపు నీరు లీకవ్వడం.. అత్యవసర వాతావరణ స్థితి ఎత్తి చూపుతోందన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.