
గండిపేట, వెలుగు : ప్రముఖ రాజకీయ, ఆర్థిక అంశాల విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ తల్లి, ఏపీలోని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కాళికాంబ(94) కన్నుమూశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో నివాసం ఉంటున్న ఆమె.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాళి కాంబ మృతి పట్ల ఉమ్మడి ఏపీకి చెందిన పలు వురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహాప్రస్థానంలో కాళికాంబ అంతక్రియలు పూర్తయ్యాయి. కాళికాంబకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరకాల ప్రభాకర్ కాళికాంబ పెద్ద కుమారుడు కాగా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద కోడలు అవుతారు.