రిలయన్స్​కు వయకామ్‌‌‌‌‌‌‌‌ 18 లోని పారామౌంట్‌‌‌‌‌‌‌‌ వాటా

రిలయన్స్​కు వయకామ్‌‌‌‌‌‌‌‌ 18 లోని పారామౌంట్‌‌‌‌‌‌‌‌ వాటా
  • టాటా ప్లేలో డిస్నీ వాటా కొననున్న టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ : వయకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 మీడియా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూఎస్  కంపెనీ పారామౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న 13.01 శాతం వాటాను రిలయన్స్ కొన్నది. ఇందుకోసం బైండింగ్ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకున్నామని ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఈ కంపెనీ తెలియజేసింది. డీల్ విలువ రూ.4,286 కోట్లు.  వయకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 లోని వాటాను రెండు సబ్సిడరీల ద్వారా పారామౌంట్ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్ చేస్తోంది.

డీల్ పూర్తయిన తర్వాత కూడా వయకామ్ 18 కు తమ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తామని యూఎస్ రెగ్యులేటరీకి  వెల్లడించింది. రిలయన్స్ జియో సినిమాలో ఈ యూఎస్ కంపెనీ కంటెంట్ అందుబాటులో ఉంది.  టీవీ 18 బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సబ్సిడరీ కంపెనీ వయాకామ్ 18 లో 57.48 శాతం వాటా ఉంది. తాజా డీల్ పూర్తయితే  ఈ వాటా 70.49 శాతానికి పెరుగుతుంది.  వయకామ్​కు 40 చానెల్స్​ ఉన్నాయి.  కామెడీ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటీవీ  

టాటా ప్లే – డిస్నీ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టాటా ప్లేలో డిస్నీ వాటాను కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ చూస్తోంది. దీంతో టాటా ప్లేలో మెజార్టీ వాటా టాటాల చేతికి రానుంది. డిస్నీ వాటాను కొనుగోలు చేయడానికి ప్రిలిమినరీ చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. టాటా ప్లే వాల్యుయేషన్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) దగ్గర ఈ డీల్ జరగొచ్చని అన్నారు.

డిస్నీ తన ఇండియా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వయకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 లో విలీనం చేయనుంది. దేశంలోని అతిపెద్ద డీటీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ అయిన టాటా ప్లేలో 29.8 శాతం వాటాను కొనుగోలు చేయాలని రిలయన్స్  ఇండస్ట్రీస్​ కూడా చూస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 50.2 శాతం వాటా టాటా సన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఉంది. మిగిలిన వాటా టెమాసెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిస్నీ కంట్రోల్లో ఉంది.