పొలాచ్చిలో పూర్తయిన పరాశక్తి మూవీ షూట్

పొలాచ్చిలో పూర్తయిన పరాశక్తి మూవీ షూట్

తమిళ నటుడే అయినా పలు డబ్బింగ్ చిత్రాలతో  తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్.  ప్రస్తుతం  డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌‌‌లు సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తను చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో ఒకటి ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, అథర్వ, రానా దగ్గుబాటి  కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. పొలాచ్చిలో జరుగుతోన్న ఈ మూవీ కీలక షెడ్యూల్‌‌‌‌ పూర్తయింది. 

దీంతో దాదాపు షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఫైనల్ షెడ్యూల్‌‌‌‌ స్టార్ట్ కానుంది. డాన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆకాష్ భాస్కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. 

పొంగల్ కానుకగా జనవరిలో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు మురుగదాస్ డైరెక్షన్‌‌‌‌లో ‘మదరాశి’ చిత్రంలో శివ కార్తికేయన్ నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.