సలార్ ముందున్న రికార్డ్స్ ఇవే.. బ్రేక్ చేయగలదా?

సలార్ ముందున్న రికార్డ్స్ ఇవే.. బ్రేక్ చేయగలదా?

ప్రస్తుతం ఇండియా మొత్తం సలార్(Salaar) ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. పలు వాయిదాల తరువాత సలార్ నేడు(డిసెంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాత్రి ఒంటిగంట నుండే షోస్ మొదలవడంతో ఆడియన్స్ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందని, ప్రభాస్ కుమ్మిపాడేశాడని  చెప్తున్నారు. దీంతో సలార్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవాకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సలార్ ముందు చాలా రికార్డ్స్ ఉన్నాయి. మరి ఆ రికార్డ్స్ ఏంటి? వాటిని ఈ సలారోడు దాటగలడా అనేది తెలుసుకుందాం.     

ఇప్పటికి ఈ ఏడాదిలో హీరో విజయ్‌ లియో.. షారుక్‌ ఖాన్‌ పఠాన్,జవాన్.. రణబీర్‌ కపూర్‌ యానిమల్ చిత్రాలు మొదటి రోజు భారీ కలెక్షన్స్‌ రాబట్టాయి. వాటిలో లియో మూవీ టాప్ పొజిషన్ లో ఉంది. ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.140 కోట్ల గ్రాస్​ ఓపెనింగ్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత షారుఖ్ నటించిన జవాన్ రూ. 129.6 కోట్లు, రణ్బీర్ యానిమల్ మూవీ రూ.116 కోట్లు రాబట్టి ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. మరి సలార్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే కనీసం రూ.150 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టాల్సి ఉంటుంది. 

 ఇక ఇండియా వైడ్ గా చూసుకుంటే ఈ విషయంలో రాజమౌళి తెరకెక్కించిన RRR ఉంది. ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.223 కోట్ల గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ చరిత్రను తిరగరాయాలంటే మాత్రం సలార్ రూ.224 కోట్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది. మరి ఈ రికార్డ్ ను సలార్ బ్రేక్ చేయగలదా చూడాలి.

ఇక సలార్ ముందున్న మరో రికార్డ్ ఏంటంటే.. సలార్ సినిమాకు వరల్డ్ వైడ్​గా రూ. 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. కాబట్టి.. ఫుల్​ రన్​లో సలార్ రూ. 600 కోట్లకు పైగా గ్రాస్​ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సలార్‌కు  రూ.150 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉంటుంది సలార్ మూవీ.

ఇక ప్రస్తుతం సలార్ సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే పైన పేర్కొన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. సలార్ సినిమాకు  మొదటిరోజే ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కాబట్టి ఇండియా వైడ్ గా ఉన్న రికార్డ్స్ అనీ సలార్ తన ఖాతాలోకి తెచ్చుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.