బింద్యారాణి పతకం గెలవడంపై తల్లిదండ్రులు ఆనందం

బింద్యారాణి పతకం గెలవడంపై తల్లిదండ్రులు ఆనందం

కామన్వెల్త్‌ గేమ్స్లో వెయిట్‌ లిఫ్టర్ బింద్యారాణి రజతం గెలుచుకోవడం ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. బింద్యారాణి ప్రదర్శన పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని తల్లి ఇబెమ్చాదేవి తెలిపారు. స్వర్ణ పతకం కోల్పోయినప్పటికీ.. రెండో ర్యాంకు కోసం ప్రయత్నం చేసిందన్నారు. గోల్డ్ మిస్ అయినందుకు బాధగా ఉన్నప్పటికీ..మరోసారి ప్రయత్నం చేయమని చెబుతానని చెప్పారు. బింద్యారాణి ఒలింపిక్స్లో తన కలను నెరవేర్చుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. 


CWG 2022లో బింద్యారాణి ప్రదర్శన కోసం ఆతృతగా ఎదురు చూసినట్లు ఆమె తండ్రి  రాజేన్ సింగ్ తెలిపారు. మొత్తంగా బింద్యారాణి పర్ఫామెన్స్ తమకు ఆనందాన్నిచ్చిందని చెప్పారు. బింద్యారాణి మెడల్ గెలవాలని దేవుడిని ప్రార్థించామని..దేవుడు తమ కోరికను నెరవేర్చాడని పేర్కొన్నారు. బింద్యారాణి పతకం గెలిచినప్పుడు మా సంతోషానికి అవధుల్లేవన్నారు. 


కామన్వెల్త్ గేమ్స్ లో  55కిలోల విభాగంలో బింద్యారాణి సిల్వర్ మెడల్ సాధించింది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని అందించింది.