మారుతున్న పేరెంట్స్ ఆలోచన .. పిల్లలకు స్టడీస్​తో పాటు స్టోర్ట్స్​ ట్రైనింగ్

మారుతున్న పేరెంట్స్ ఆలోచన .. పిల్లలకు స్టడీస్​తో పాటు స్టోర్ట్స్​ ట్రైనింగ్
  • మారుతున్న పేరెంట్స్ ఆలోచన ధోరణి
  • హెల్త్​, ఫిజికల్​ ఫిట్​నెస్​కు ఇంపార్టెన్స్​​
  • సిటీలోని అకాడమీల్లో స్టూడెంట్స్ ఫుల్

హైదరాబాద్​, వెలుగు: చదువు, ఇల్లు, ట్యూషన్​, మార్కులు, ర్యాంకులు ఇవే పిల్లల లైఫ్. ఇది కొంతకాలం కిందటి మాట. పిల్లల యాక్టివిటీ మారుతుంది. పేరెంట్స్ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు. స్పోర్ట్స్​ కూడా మస్ట్ అని భావిస్తున్నారు. ఆటలు శారీరక, మానసిక వృద్ధికే కాకుండా కెరీర్​కు కూడా ప్లస్​ అవుతుండగా స్పోర్ట్స్​ కు కూడా ఇంపార్టెన్స్​ఇస్తున్నారు. స్కూళ్లలో సరైన ప్లే గ్రౌండ్స్​ లేక వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్​ అకాడమీల్లో  పిల్లలకు ఏదో ఒక స్పోర్ట్​లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కొంతకాలంగా సిటీలోని స్పోర్ట్స్​అకాడమీలు స్టూడెంట్స్​తో నిండిపోతున్నాయి. ఒక్కో అకాడమీలో వందల సంఖ్యలో స్టూడెంట్స్​ ట్రైనింగ్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. 

టెక్నాలజీ పెరుగుతుండగా... 

ఆటలపై పేరెంట్స్ కు సరైన అవగాహన లేకుండే. కొన్నేండ్ల నుంచి ప్రయార్టీ ఇస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతుండటం, పిల్లలు టీవీలు, మొబైల్స్ కు అతుక్కుపోతుండడం, సోషల్​మీడియాపై ఆసక్తి చూపుతుండడం గమనిస్తున్న పేరెంట్స్​ ఫిజికల్​గేమ్స్​వైపు పిల్లల దృష్టి మళ్లిస్తున్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ పై శ్రద్ధ పెరిగింది. పిల్లలను కూడా హెల్దీగా, ఫిజికల్​గా ఫిట్​గా ఉంచాలని పేరెంట్స్​నిర్ణయించుకుంటున్నారు. స్పోర్ట్స్​ లో ఉన్న పిల్లలు మిగతా వారికంటే చాలా చురుకుగా, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కెరీర్​పరంగా కూడా స్పోర్ట్స్​లో చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక కోటాలో రిజర్వేషన్స్​ కూడా ఉన్నాయి. పీవీ సింధు, నిఖత్​ జరీన్​ లాంటి స్పోర్ట్స్​ఉమన్స్​కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కూడా పేరెంట్స్​ఆలోచనల్లో మార్పు రావడానికి కారణంగా చెప్పవచ్చు. మరికొందరు పిల్లల ఇష్టా అయిష్టాలను గుర్తించి వారి కేరీర్​నే పూర్తిస్థాయిలో స్పోర్ట్స్​ వైపు మళ్లిస్తున్నారు.

 అకాడమీల్లో సందడిగా..

కొన్నేండ్లుగా సిటీలోని స్పోర్ట్స్​అకాడమీలు స్టూడెంట్స్​తో నిండిపోతున్నాయి. చాలా స్కూళ్లలో గ్రౌండ్స్​, పీఈడీలు లేకపోవడం, స్పోర్ట్స్​కు సరైన ప్రయార్టీ ఇవ్వకపోవడంతో  అకాడమీల్లో జాయిన్​ చేస్తున్నారు పేరెంట్స్.  క్రికెట్, టెన్నిస్​, స్విమ్మింగ్, సైక్లింగ్, రెజ్లింగ్, స్కేటింగ్,కరాటే, వాలీబాల్​, ఫుట్​బాల్​, కబడ్డీ... తదితర ఆటల్లో ట్రైనింగ్ తీసుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో అకాడమీలో వందల సంఖ్యలో ఉన్నారు. గర్ల్స్​, బాయ్స్ అనే తేడా లేకుండా స్పోర్ట్​లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఆయా గేమ్స్​, అకాడమీలను బట్టి నిర్వాహకులు వేలల్లో ఫీజులను వసూలు చేస్తున్నారు. ఒక్కో అకాడమీలో క్రికెట్ కు 2,500 నుంచి తీసుకుంటున్నారు. మార్నింగ్, ఈవెనింగ్​సెషన్స్​ కు వచ్చే వారికి రెట్టింపు ఫీజు వసూలు చేస్తున్నారు.

పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుంది 

పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా అవసరం. వారిలో ఆటలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మా ఇద్దరమ్మాయిలు స్పోర్ట్స్​లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మార్నింగ్​గేమ్స్ ఆడితే.. పిల్లలు రోజంతా యాక్టివ్​గా, హెల్తీగా ఉంటారు. చదువులో కూడా మిగతా వారితో పోల్చితే చురుకుగా ఉంటారు.
– హరిబాబు, పేరెంట్, బాలాపూర్

చిన్న ఏజ్​లోనే ఆడితే..

  కొన్నేండ్లుగా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది. గతంలో  సైక్లింగ్ లో​ 150 మంది స్టేట్స్​వెళితే..  ఇటీవలే 250 మంది వెళ్లారు. రెగ్యులర్​గా స్పోర్ట్స్​ యాక్టివిటీలో పాల్గొనడం ద్వారా బ్రెయిన్ షార్ప్​గా ఉంటుంది. స్టామినా కూడా పెరుగుతుంది. ఆనారోగ్య సమస్యలు కూడా రావు. చిన్నప్పటి నుంచే స్పోర్ట్ లో ఉంటే బ్రైట్​ప్యూచర్​ఉంటుంది. 
– విజయ్​ భాస్కర్​ రెడ్డి, సైక్లింగ్​కోచ్, స్పోర్ట్స్​అథారిటీ ఆఫ్​ తెలంగాణ, ఓయూ

 స్పోర్ట్స్​ను కెరీర్ గా ఎంచుకుంటూ..

అకాడమీకి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది. గతంలో సమ్మర్​లోనే ఎక్కువ మంది జాయిన్ అయ్యేవారు. కానీ కొన్నేండ్లుగా  కాలంతో సంబంధం లేకుండా వస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ స్పోర్ట్స్​ను కెరీర్ గా ఎంచుకుంటున్నారు.
– రమేశ్, డీబీఆర్​ స్పోర్ట్స్​అకాడమీ, తెల్లాపూర్ ​