ఫిట్నెస్ లేని బస్సులు.. అర్హత లేని టీచర్లు

ఫిట్నెస్ లేని బస్సులు.. అర్హత లేని టీచర్లు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్

టేక్మాల్, వెలుగు: అర్హత లేని టీచర్లతో విద్యాబోధన చేయిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టేక్మాల్ మండల కేంద్రంలోని హోలీ స్పిరిట్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని  నిలదీశారు. కేరళ టీచింగ్ స్టాఫ్ తో విద్యాబోధన చేస్తామని చెప్పడంతో తమ పిల్లలను బడిలో చేర్పించామని అర్హత లేని లోకల్ టీచర్లు బోధించడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. 

కార్పొరేట్ స్కూల్ కి తగ్గట్టు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలేదని ఆరోపించారు. ఫీజులు వసూలు చేసి ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫామ్స్   అందజేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్లే గ్రౌండ్,  టాయిలెట్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫిట్​నెస్, ఇన్సూరెన్స్ లేకుండానే బస్సులు  నడుపుతున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే  ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఎంఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.