- సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతలతో పిల్లలపై ఎఫెక్ట్
- 1.5 లీటర్ల వాటర్ తాగాలంటున్న డాక్టర్లు
- సరిగా నీరు తీసుకోకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్
హైదరాబాద్, వెలుగు: ఎండాకాలం వచ్చేసింది. ప్రస్తుతం సిటీలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండలు, ఉక్కపోతతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతుండగా.. పిల్లలు స్కూళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతలు స్కూళ్లకు వెళ్లే పిల్లలపై ఎఫెక్ట్ చూపొచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే అనార్యోగాల పాలవుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రోజూ తగినన్ని నీళ్లు తాగితే ఎలాంటి అనారోగ్యం రాదని పేర్కొంటున్నారు.
స్కూళ్లలో వాటర్బ్రేక్ ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. హాఫ్ డే స్కూల్స్ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తుండగా ఆ సమయంలో పిల్లలు స్కూళ్లలోనే ఉంటారు. వారు కనీసం 1.5 లీటర్ల నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయని, పిల్లలు ఏకాగ్రత కోల్పోతారని పేర్కొంటున్నారు.
స్కూళ్లలో సరిగ్గా తాగట్లేదు
సమ్మర్ లోనే కాదని మిగతా కాలాల్లో కూడా తగినన్ని నీళ్లు బాడీకి అవసరం. రోజూ 3 సార్లు వాటర్ తాగడానికి 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇస్తూ.. ప్రతిసారి నీరు తాగేలా టీచర్లు పర్యవేక్షించాలి. అయితే.. స్కూళ్లలో పిల్లలు ఎక్కువగా నీళ్లను తాగడం లేదు. ఇండ్లలో పేరెంట్స్నింపి ఇచ్చిన బాటిల్‌ను సగం కూడా ఖాళీ చేయకుండా తెస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
వాటర్ కోసం టీచర్లను అడగడానికి భయపడి జనరల్బ్రేక్ టైమ్దాకా వెయిట్చేస్తున్నామని, ఇంకొందరికి తాగాలనేదే గుర్తుకురావడం లేదని పిల్లలు అంటున్నారు. స్కూళ్లలో వాటర్ బ్రేక్ ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉండగా అమలుకు నోచుకోవడంలేదు. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తెచ్చుకునేలా, స్కూళ్లల్లో తగిన చల్లని తాగునీరు, వాటర్బ్రేక్ టైమ్‌లో పిల్లలు వాటర్ తాగుతున్నారా.. లేదాఅనేది టీచర్లు పర్యవేక్షిస్తే చాలని పేరెంట్స్ పేర్కొంటున్నారు.
ఆరోగ్యంపై ఎఫెక్ట్
పిల్లలు వాటర్ తగినంత తీసుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సమ్మర్ లో బాడీలో హీట్ప్రొడ్యూస్ చేయడానికి, ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ నీరు చాలా అవసరమని, లేదంటే డీ హైడ్రేషన్బారిన పడతారని పేర్కొంటున్నారు. బీపీ డౌన్‌కావడం, కిడ్నీ, వడదెబ్బ, యూరిన్ఇన్ఫెక్షన్, చర్మ, జీర్ణ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడొచ్చని, దీని నివారణకు వాటర్బ్రేక్అమలు చేయడం బెటర్ అంటున్నారు.
1.5 లీటర్ల నీళ్లు తీసుకోవాలి
హాఫ్ డే స్కూల్స్ టైమ్‌లో పిల్లలు కనీసం 1.5 లీటర్ల నీళ్లు తాగాలి. లేదంటే అనారోగ్యాల బారిన పడే చాన్స్ ఉంది. తగినన్నీ నీళ్లు తాగకపోతే... డీ హైడ్రేషన్‌కు కూడా గురవుతారు. వడదెబ్బ, కిడ్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీ వెయిట్ కు తగినట్టుగా వాటర్ తాగాలి.
డాక్టర్కమల్ కిరణ్, నెఫ్రాలజిస్ట్, హైదరాబాద్
పిల్లలకు గుర్తు చేస్తుండాలి
సమ్మర్ లో స్కూళ్లలో వాటర్ బ్రేక్ఇవ్వాలి. పిల్లలు గంటకోసారి వాటర్తాగేలా టీచర్లు చూడాలి. చిన్న పిల్లలకు తెలియదు. వారికి గుర్తు చేస్తుండాలి. పిల్లల ఆరోగ్యాన్ని కాపాల్సిన బాధ్యత కూడా ఉంది. మధ్యాహ్నం12:30 వరకే స్కూల్స్నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినా చాలా స్కూల్స్ సాయంత్రం 3 గంటల దాకా నడుస్తుండగా..డీఈవోలు కూడా తనిఖీలు చేయట్లేదు.
వెంకట్ సాయి, హైదరాబాద్ స్టూడెంట్స్ పేరెంట్స్‌అసోసియేషన్
వాటర్ బ్రేక్ ఇస్తే బెటర్
మా అమ్మాయి ఫోర్త్క్లాస్చదువుతుంది. రోజూ లీటర్ వాటర్ నింపి బాటిల్ఇచ్చి పంపిస్తాం. సగం కూడా పూర్తి చేయదు. అడిగితే... గుర్తులేదు అంటది. స్కూళ్లో ఉన్నంత సేపు పిల్లలు నీళ్లుతాగేలా టీచర్లు చూడాలి. వాటర్ బ్రేక్పెడితే ఇంకా బెటర్.
రాజ రాజేశ్వరి, పేరెంట్, కర్మన్ ఘాట్