రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది : రామ్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది :  రామ్మోహన్ రెడ్డి

గండీడ్, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో సల్కరిపేట, రంగారెడ్డిపల్లి, లింగాయపల్లి , జక్లపల్లి, జిన్నారం, జిన్నారం తండాల్లో ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్పంచులు, నాయకులు కాంగ్రెస్ లో చేరకుండా గంప కింద కోళ్లను దాచినట్లు దాస్తున్నారన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఉమ్మడి గండీడ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో  రాములు, పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,  శాంతి, సర్పంచ్  లక్ష్మీదేవి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.