ఇండస్ట్రియల్ కారిడార్కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు .. పరిగిలో రైతుల ఆందోళన

ఇండస్ట్రియల్ కారిడార్కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు .. పరిగిలో రైతుల ఆందోళన

పరిగి, వెలుగు: ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా పరిగిలో రాపోల్, కళ్డాపూర్ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. తమ గ్రామాల్లోని 1,197 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

పరిగి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్ స్తంభించింది. భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. ఆందోళన విరమింపజేసే క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. చివరకు రైతులు, నాయకులు కలిసి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం సమర్పించారు.