రాష్ట్ర ప్రజలు కామధేనువు లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు : రామ్మోహన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలు కామధేనువు లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు : రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలు దున్నపోతును తన్ని తరిమేసి.. కామధేనువు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ‘జనం పాలిచ్చే బర్రెను వదిలి.. దున్నపోతును తెచ్చుకున్నారు’అని కేసీఆర్ బలుపు మాటలు మాట్లాడుతుండని ఆయన ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు ఏమాత్రం సిగ్గురాలేదన్నారు.

ఎన్టీఆర్ ను మించి తనను మళ్లీ గెలిపించుకుంటారని కేసీఆర్ ఊహించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంటే కదా మళ్లీ గెలవడానికి అని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల సమస్యలంటూ కేటీఆర్ ఇంకా డ్రామాలు ఆడుతున్నారని, ఆ నిరుద్యోగులే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. సాంకేతిక సమస్యలను ఆసరాగా చేసుకొని నిరుద్యోగులను కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో ఎంత షో చేసినా జనం నమ్మరని, ఆ కుటుంబం సినిమా ముగిసిందన్నారు.