
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
వికారాబాద్ జిల్లా, వెలుగు : లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన జిల్లాలోని పరిగి టౌన్లో గురువారం జరిగింది. మండల పరిధిలోని సయ్యద్ పల్లికి చెందిన భూమన్నగారి సాయిరెడ్డి, మాదని సురేష్ కు మధ్య కొద్దిరోజుల కిందట ఆలయ పూజలకు సంబంధించి గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి వాట్సప్గ్రూప్లోవైరల్గా మారింది. భూమన్నగారి సాయిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితుడైన మాదని సురేష్ పరిగి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గ్రామ పెద్దలు, పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ రూ. 10 వేలు లంచం ఇవ్వాలని సాయిరెడ్డిని డిమాండ్ చేశాడు. అతడు ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం సాయిరెడ్డి నుంచి ఎస్ఐ క్రాంతికుమార్లంచం డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశామని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.