
ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉన్నా.. తాజాగా వచ్చిన అప్ డేట్ తో అది నిజమనే తెలుస్తోంది. వారిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ లో డిన్న ర్ చేస్తూ మీడియా కంటపడ్డారు. ఆ తర్వాత మార్చి 23న ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ పాల్గొనడమే కాకుండా.. ఒకే కారులో వెళ్లిపోవడం అటు సినీ వర్గా్ల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది. ఈ సంఘటనలతో ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నది నిజమేనంటూ ప్రచారం మొదలైంది.
ఎంపీ రాఘవ్, పరిణీతి చోప్రాల డేటింగ్ వార్తలపై వారిలో ఏ ఒక్కరూ అది నిజమేనని చెప్పలేదు. అలా అని అది అబద్దమని కూడా స్పష్టం చేయకుండా సమాధానాల్ని దాటవేయడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై ఆప్ ఎంపీ రాఘవ్ ను ప్రశ్నించగా.. దయచేసి తనను రాజకీయాల గురించి ప్రశ్నలు అడగండి, పరిణీతి గురించి కాదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాఘవ్, పరిణీతి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చద్దా ఆప్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతోన్నారు.