
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. ఈ ఏడాది మేలో వీరిద్దరిరకి నిశ్చితార్థం జరగగా ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా వీరి పెళ్లి 2023 సెప్టెంబర్ 25న ఫిక్స్ చేశారని సమాచారం. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను తమ వివాహ వేదికగా పరిశీలిస్తున్నారట. ఇక రిసెప్షన్‌ను గురుగ్రామ్‌లో నిర్వహిస్తారని సమాచారం. ఇదే ప్లేస్ లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018లో వివాహం చేసుకున్నారు.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మధ్య లండన్‌లో పరిచయం ఏర్పడింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఈ ఏడాది మార్చిలోనే విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్ డేట్‌కు వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె ‘చమ్కిలా’, ‘క్యాప్సూల్ గిల్’ చిత్రాలలో నటిస్తోంది.