
రూమర్లకు తెరదించారు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఢిల్లీ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. రాజకీయ, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఘనంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఢిల్లీలో మే 13వ తేదీ శనివారం సాయంత్రం వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, పొలిటికల్ లీడర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాఘవ్- పరిణీతి ఉంగరాలు మార్చుకున్నారు. వీరి ఎంగేజ్ మెంట్ వేడుక సాంప్రదాయ సిక్కు ప్రార్థన ప్రసంగంతో ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు సుఖమణి సాహిబ్‌తో అర్దాస్ తర్వాత మొదలైంది. శుకుమణి సాహిబ్ సిక్కు గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌లోని కొంత భాగాన్ని పఠించారు. ఆ తర్వాత ఇద్దరు రింగ్స్ మార్చుకున్నారు. నిశ్చితార్ధం కోసం ఇద్దరూ క్రీమ్ కలర్ డ్రెస్సుల్లో చాలా క్యూట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపించారు. ఒకరి ముఖంలో మరొకరు పెట్టుకొని ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలకు అభిమానులు లైక్స్‌ల వర్షం కురిపిస్తున్నారు.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మధ్య లండన్‌లో పరిచయం ఏర్పడింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అయితే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని...త్వరలో నిశ్చితార్థం చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేసినా..అటు రాఘవ్ చద్దా, ఇటు పరిణీతి చోప్రా ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్చిలోనే విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్ డేట్‌కు వచ్చినప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.మరోవైపు పరిణీతి, రాఘవ్ ల వివాహం అక్టోబర్‌లో వివాహం జరగనుందని తెలుస్తోంది.