తమిళ బ్లాక్ బస్టర్ ‘పార్కింగ్‌’ మూవీ గుర్తుందిగా.. ఇపుడు ఆ హీరో మరో ప్రాజెక్ట్తో.. ఇంట్రెస్టింగ్గా గ్లింప్స్

తమిళ బ్లాక్ బస్టర్ ‘పార్కింగ్‌’ మూవీ గుర్తుందిగా.. ఇపుడు ఆ హీరో మరో ప్రాజెక్ట్తో.. ఇంట్రెస్టింగ్గా గ్లింప్స్

పార్కింగ్‌‌‌‌, లబ్బర్ పందు లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో హరీష్ కళ్యాణ్‌‌‌‌.. ఇప్పుడు ఓ మాస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘లిఫ్ట్‌‌‌‌’ ఫేమ్ వినీత్‌‌‌‌ వరప్రసాద్‌‌‌‌ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, త‌‌‌‌మిళ భాష‌‌‌‌ల్లో రానున్న ఈ చిత్రానికి ‘దాషమకాన్’ (Dashamakan) అనే టైటిల్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేస్తూ, టైటిల్ ప్రోమోను విడుద‌‌‌‌ల చేశారు.

దాషమకాన్‌‌‌‌ అనేది చెన్నైలోని ఓ ప్రాంతం. ఇక టైటిల్‌‌‌‌ ప్రోమోను చూస్తే.. లోకల్‌‌‌‌ రౌడీలు తమ బాస్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో చెబుతున్న హీరోని వెతుకుతూ ఆ ప్రాంతానికి వస్తారు.  ఆ మాస్‌‌‌‌ ఏరియాలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌‌‌‌లోకి హీరో వెళ్లడం చూసి ఫాలో అవుతారు. సీన్ కట్ చేస్తే ఆ ఫోన్ చేసిన బాస్‌‌‌‌ మర్డర్ అవుతాడు. టాయిలెట్‌‌‌‌ నుంచి తాపీగా బయటకు వస్తున్న హీరోని చూసి వణికిపోతారు రౌడీలు. వాళ్లను చితక్కొడుతూ తన ట్రూప్‌‌‌‌తో కలిసి ఓ ర్యాప్ సాంగ్ పాడుతుంటాడు హీరో.

చేతిలో ఉన్న కత్తిని తిప్పగా అది మైక్‌‌‌‌లా మారిపోతుంది.  హీరో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లోని టు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌ను ఇలా ప్రజెంట్ చేశారు. మాస్‌‌‌‌, యాక్షన్‌‌‌‌ విజువల్స్‌‌‌‌ తో కట్ చేసిన ఈ టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘కన్నప్ప’ ఫేమ్  ప్రీతి ముకుంద‌‌‌‌న్ ఇందులో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  సత్యరాజ్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  బ్రిట్టో మైకేల్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

‘పార్కింగ్‌’ మూవీ గురించి: 

అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళకి పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. అదే కాన్సెప్ట్ గా తీసుకొని దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన మూవీ పార్కింగ్. వినూత్న కథతో వచ్చిన ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇందూజ రవిచంద్రన్, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు తదితరులు నటించారు. ఈ సినిమా డిసెంబర్ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. డిస్నీ+హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది.

పార్కింగ్ అనేది సాధారణంగా అందరికి ఉండే సమస్యే. అందుకే ఈ సినిమాకు ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యారు. అలాంటి కథను అంతే సహజంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్ చేశాడు దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్. సినిమా చూస్తున్నంతసేపు ఎదో మన ఇంటిపక్కనే జరుగుతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది.

నిజానికి ఈ కథలో ఈశ్వర్, ఏకరాజ్ ఇద్దరు మంచి వాళ్ళే కానీ.. పరిస్థితులను బట్టీ వాళ్ళు మారిపోయే తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. లంచం తీసుకోవడం కూడా నచ్చని మంచి మనిషి.. ఒకరిని చంపేయడానికి సిద్దమవుతాడు. అదే కథను ఆసక్తికరంగా మార్చింది. ఇపుడు ‘పార్కింగ్‌ హీరో హరీష్ కళ్యాణ్‌‌‌‌ మరో మూవీతో వస్తుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.