బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడడంతో యూకే నుంచి వచ్చే వెహికల్స్ కు ఫ్రాన్స్ గేట్లు మూసేసింది. ఆ దేశాల నుంచి వచ్చే ఏ వెహికల్ కూడా తమ భూభాగంపైకి అడుగుపెట్టకుండా టెంపరరీగా చర్యలు తీసుకుంది. దీంతో యూకే నుంచి నిత్యావసరాలతో పాటు ఇతర వస్తువుల రవాణా బార్డర్ దగ్గరే ఆగిపోయింది. ఇంగ్లండ్ నుంచి వస్తువుల ఎగుమతికి ఉపయోగించే పోర్ట్ ఆఫ్ డోవర్ కూడా మూతబడింది. వివిధ ప్రాంతా ల నుంచి పోర్ట్ ఆఫ్ డోవర్ కు వచ్చిన ఫ్రైట్ వెహికల్స్ రోడ్ మీద కిలోమీటర్ల మేర నిలిచిపోయినయి. రోడ్ ను క్లియర్ చేయడానికి అధికారులు వాటన్నింటినీ మాన్ స్టన్ ఎయిర్ పోర్టు కు తరలించి, ఇదిగో ఇలా పార్క్ చేశారు. ట్రాఫిక్ బ్యాన్ ను ఎత్తేసేందుకు ఫ్రాన్స్ తో చర్చలు జరుపుతున్నారు .
