ఇంటర్ సర్వీసెస్ ​బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఇంటర్ సర్వీసెస్ ​బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ : ఇంటర్ సర్వీసెస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. శుక్రవా రం లోక్​సభలో బిల్లు పాస్ అవ్వగా.. మంగళవారం రాజ్యసభలో క్లియర్ అయింది. కమాండర్ ఇన్ చీఫ్, ఆఫీసర్ ఇన్ కమాండ్, ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజే షన్​లో పనిచేస్తున్న లేదా అనుబంధంగా ఉన్న సిబ్బందికి సంబంధించిన డిసిప్లీన రీ, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్నీ ప్రభుత్వం నియమించే అధికారికి ఇవ్వడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ మాట్లాడా రు. ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనేం దుకు భారత్​ సిద్ధంగా ఉందన్నారు. దేశ రక్షణకు సంబంధించిన అన్ని రంగాల్లో కేటాయింపులు ప్రస్తుతం జీడీపీలో 3% నుంచి 4% ఉందని, అవసరమైతే 5% నుంచి 6 శాతానికి పెంచుతామన్నారు. డిఫెన్స్ సెక్టార్​లో ఖాళీలను భర్తీ చేస్తామ న్నారు. సముద్ర మార్గంలో కూడా భద్రత ఏర్పాటు చేశామన్నారు. దేశ రక్షణ విషయంలో సన్నద్ధత కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.