
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా జులై మూడో వారం నుంచి సభ కొలువు దీరనున్నట్లు సమాచారం. జులై మూడోవారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు ఉభయసభలను సమావేశపర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న జులై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 12 వరకు సభ కొనసాగించాలని పార్లమెంటరీ అఫైర్స్ కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. సభ నిర్వాహణకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మాన్ సూన్ సెషన్ లో ఉభయ సభలు 17 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సెషన్ లో పార్లమెంటరీ కమిటీ స్క్రూటినీకి పంపిన నాలుగు బిల్లులతో పాటు పలు బిల్లులు ఈసారి సభ ముందుకు రానున్నాయి.