సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్

సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్

వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం

పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్ష్య ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాకింగ్ కు గురైనట్లు సంసద్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక కొంత మంది హ్యాకర్లు తమ చానల్ ను హ్యాక్ చేసి లైవ్ స్ట్రీమింగ్ చేయటంతో పాటు చానల్ పేరును ‘ఇథేరియం’ గా మార్చారని తెలిపింది. ఇదే విషయాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తమకు తెలియజేసిందని పేర్కొంది. తెల్లవారుజామున 3.45 సమయంలో చానల్ ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చకున్నట్లు సంసద్ టీవీ పేర్కొంది. కాగా తమ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు టీవీ చానల్ ఖాతాను తొలగించినట్లు యూట్యూబ్ ప్రకటించింది. అయితే ఏ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుందో యూట్యూబ్ మాత్రం ఇంతవరకు స్పష్టం చేయలేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కిరించి సేవలను పునరిద్ధరిస్తామని సంసద్ టీవీ తెలిపింది. 

ఇవి కూడా చదవండి: 

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం