పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం : రాహుల్ గాంధీ

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం : రాహుల్ గాంధీ

పార్లమెంట్‌ భద్రత ఉల్లంఘనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలసీలు, నిరుద్యోగభృతి కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ విధానం వల్ల దేశ పౌరులకు ఉపాధి లభించడం లేదని, భద్రతా ఉల్లంఘన జరగడానికి నిరుద్యోగమే కారణమని అన్నారు. భారతీయ జనాభా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాహుల్ గాంధీ చెప్పారు.

భద్రతా ఉల్లంఘన జరిగిందన్న మాట నిజమేనని.. అయితే అసలు విషయం ఏమిటంటే అది ఎందుకు జరిగింది? అన్న విషయానికొస్తే.. ప్రధాన సమస్య నిరుద్యోగమేనని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ జీ విధానాల వల్ల భారత ప్రజలకు ఉపాధి లభించడం లేదని చెప్పారు. ప్రధానమంత్రి విధానాల పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కూడా పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ గాంధీ అన్నారు.