పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 2న అఖిలపక్ష భేటీ

పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 2న అఖిలపక్ష భేటీ

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.  2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు జరగనున్నాయి.  ఈ మేరకు  అఖిలపక్ష భేటీని  కేంద్రం ఏర్పాటు చేసింది.  డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆహ్వానాలు పంపింది. 

సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది.కానీ డిసెంబర్ 03న తెలంగాణతో పాటుగా మరో నాలుగురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండటంతో దీనిని ఒక రోజు ముందు జరుపుతుంది.   ఈ సమావేశాల్లోనే ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల ఆమోదానికి సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.  

ఈ బిల్లులకు సంబంధించిన మూడు నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్‌ కమిటీకి చేరాయి. అదేవిధంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్‌ల నియామకానికి సంబంధించిన బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగనుంది.