నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్  సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిస్థితి, ఎకానమీ స్లో డౌన్, నిరుద్యోగంపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమైతే.. సిటిజన్​ షిప్ వంటి కీలకమైన బిల్లులను ఆమోదించుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేసుకుంది. కొత్త, దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు, ఈ -సిగరెట్లను బ్యాన్ చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్​లను బిల్లుల రూపంలో ప్రవే శ పెట్టనుంది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో సెషన్ ఇది. ఈ నెల 26న కానిస్టిట్యూషన్ డే సందర్భంగా ఉభయసభల జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. డిసెంబర్ 13న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.

Parliament's winter session beginning November 18