ఆంటన్! ఆంటన్! అంటూ.. యజమానిని కాపాడిన చిలుక

ఆంటన్! ఆంటన్! అంటూ.. యజమానిని కాపాడిన చిలుక

క్వీన్స్‌లాండ్‌‌: జంతువులు నిస్వార్థమైన ప్రేమను చూపిస్తుంటాయి. అందుకే చాలా మంది సరదాగా కుక్కలు, పిల్లులను పెంచుకుంటుంటారు. కొందరు పక్షులనూ పెంచుకుంటారు. ఈ పెట్స్ తమ యజమానులపై ప్రేమను చూపించడమే కాకుండా ఒక్కోసారి వారిని ప్రమాదాల నుంచీ కాపాడతాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకునే ఓ ఘటన తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌‌లో జరిగింది.

ఎరిక్ అనే చిలుక అగ్ని ప్రమాదం నుంచి తన యజమానిని రక్షించింది. పొగను స్మోక్ డిటెక్టర్స్ కంటే ముందే పసిగట్టి తన యజమాని అయిన ఆంటన్ నుయెన్‌‌‌‌ను అలర్ట్ చేసింది. ‘నా చిలుక (ఎరిక్) అరవడం నాకు వినిపించింది. అది బిగ్గరగా అరవగానే నేను లేచా. ఏదో పొగ లాంటి వాసన వస్తున్నట్లు నాకు అనిపించింది. దీంతో ఎరిక్‌‌‌ను పట్టుకొని తలుపును తెరిచా. ఇంటి వెనుక కొన్ని మంటలు వ్యాపించడం కనిపించింది. దీంతో నా బ్యాగ్‌‌తోపాటు ఎరిక్‌‌ను తీసుకొని బయటపడ్డా’ అని ఆంటోన్ నుయెన్ చెప్పారు. తన యజమానిని ఆంటన్, ఆంటన్ అంటూ చిలుక పిలవడంతో ఆయన లేచి ప్రమాదం నుంచి బయటపడ్డారని క్వీన్స్‌‌లాండ్ ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్టింగ్ ఇన్స్‌‌పెక్టర్ కామ్ థామస్ పేర్కొన్నారు.