రాజ్‌భవన్‌ లాన్‌లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

రాజ్‌భవన్‌ లాన్‌లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్‌
  • హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లనున్న కాంగ్రెస్‌

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజకీయాల్లో రోజుకో పరిణామం జరుగుతోంది. హైకోర్టు సచిన్‌ పైలెట్‌కు ఫేవర్‌‌గా తీర్పు చెప్పడంతో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తరఫు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశ పరచాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీని సమావేశ పరిచి బలపరీక్ష నిర్వహించాలని గెహ్లాట్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సహా రాజ్‌భవన్‌ చేరుకున్నారు.
సుప్రీం కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్‌
హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చ చెప్పాయి.