బీహార్ లో రాజకీయ గందరగోళానికి తెర

బీహార్ లో రాజకీయ గందరగోళానికి  తెర

రాజకీయాల్లో కుర్చీలాట గంట గంటకూ మారుతూ ఉంటుంది. అసమ్మతి నేతలు అవిశ్వాస తీర్మాణం అనే పేరుతో ఎప్పుడు, ఎవరి  సీటు లాగేస్తారో ఊహించలేం.  లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు NDA, UPA పార్టీ కూటమిలు చాకచక్యంగా పావులు కదుపుతున్నాయి. మొన్నటి వరకూ ఇండియా కూటమిలో ఉండి, ఎన్డియేలోకి వచ్చిన బీహార్ రాష్ట్ర ముఖ్య మంత్రి నితీష్ కుమార్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 12న (రేపు) ముఖ్యమంత్రి పదవిపై అవిశ్వాస తీర్మాణం పెట్టనున్నారు.

బిహార్ లో రెండు ప్రధాన పార్టీలైన జేడీయూ బీజేపీ(NDA) వైపు, ఆర్ జేడీ కాంగ్రెస్ (UPA) పైపు ఉన్నాయి. బీహర్ లో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న జేడియూ ఫ్లోర్ టెస్ట్ ఎమ్మెల్యేలు అందరూ అప్పని సరిగా రావాలని మంత్రి శ్రవణ్​ కుమార్ మూడు లైన్ల విప్  జారీ చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించగా, బీజేపీ తమ ప్రతినిధులను బుద్ధగయకు పంపిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా నిన్న మధ్యాహ్నం సీఎం నితీష్ కు కుమార్ ఏర్పాటు చేసిన వింధుకు 10మంది ఆ ఎమ్మెల్యేలు రాలేదు. దీంతో వారిపై అనుమానాలు వస్తున్నాయి.
బలపరీక్షలో నెగ్గి ఎన్​డీఏతో ప్రభుత్వాన్ని కొనసాగించాలని సీఎం నితీష్ పట్టుదలతో ఉన్నారు. విశ్వాస పరీక్షలో నితీశ్​ను ఓడించి, ఆర్​జేడీ  ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ UPA కూటమి ప్రయత్నిస్తోంది. ఫ్లోర్ టెస్ట్ లో నీతీశ్ ఓడిపోయేలా ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  సీపీఐ (ఎమ్​ఎల్),  హిందుస్థానీ ఆవమ్ మోర్చా  పార్టీలు నితీష్ వైపే ఉన్నాయి.