
పర్వతగిరి, వెలుగు: పర్వతగిరి ఎంపీపీఎస్ 4, 5వ తరగతుల విద్యార్థులు గురువారం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది విధులు, విభాగాలు, తప్పు చేసిన వారికి ఏ విధమైన శిక్షలు విధిస్తారో తెలుసుకున్నారని హెచ్ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. క్షేత్ర సందర్శనల ద్వారా విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను నిజ జీవితానికి అన్వయించుకుంటారని చెప్పారు.