
ఇండిగో ప్యాసింజర్ అరెస్ట్
గువాహటి: ఇండిగో విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఫ్లైట్‌లోని ప్యాసింజర్లు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని త్రిపుర రాజధాని అగర్తలలో ఎయిర్పోర్ట్అధికారులు మీడియాకు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
నిందితుడు బిశ్వజిత్ దేవ్నాథ్ (41) ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను బలవంతంగా ఓపెన్చేసేందుకు ప్రయత్నించగా విమానంలోని ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు. విమానం సిబ్బందితోనూ బిశ్వజిత్ అమర్యాదగా ప్రవర్తించాడు. అస్సాంని గువాహటి నుంచి అగర్తలకు ఫ్లైట్ వస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.