
సూపర్ స్టార్ రజనీకాంత్ మానియా మాములుగా లేదుగా. ఆయన హీరోగా నటిస్తున్న 'జైలర్' సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్అప్డేట్సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్ను జులై 28న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
మేకర్స్ అభిమానులు, ఫాలోవర్ల కోసం వెయ్యి ఉచిత పాస్‌లను జారీ చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. అయితే రిజిస్ట్రేషన్‌ను స్టార్ట్ చేసిన15 సెకన్లలో మొత్తం పాస్‌లు క్లైయిమ్ చేసుకున్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ ఒక్క వార్త తలైవా క్రేజ్‌ని మరో సారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లో మేకర్స్ బిజీగా ఉన్నారు.
యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సునీల్, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఇప్పటికే సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చాలా రోజుల తరువాత రజనీ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.