
పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు వెయ్యి మంది పోటీ చేస్తారని తెలిపారు.. రైతు ఐక్య వేదిక నాయకులు. ఎన్ని సార్లు ఆందోళనలు చేసినా పసుపు రైతుల సమస్యలు కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించినట్లు చెప్పారు. తమకు జరుగుతున్న అన్యాయం దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తామన్నారు.