రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ డివిజన్లను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమెలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన డివిజన్లలలో మౌలిక సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కాలనీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు.
