- ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
అమీన్పూర్/పటాన్చెరు, వెలుగు : రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవనుంది. డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో శుక్రవారం నుంచి ఈనెల 30వరకు మూడు రోజుల పాటు 44వ తెలంగాణ అండర్ 14 ఖోఖో బాల బాలికల అంతర్ జిల్లాల చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి. గురువారం ఉదయం మైత్రి మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. 33 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతితో పాటు టిఫిన్, భోజనం సదుపాయాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పటాన్చెరు క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏడాది పొడవునా వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ పోటీలకు పటాన్చెరు మైదానాన్ని వేదికగా నిలుపుతున్నామన్నారు. పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం అయ్యప్ప మహా పడిపూజను నిర్వహిస్తున్నట్లు మాలధారులు, భక్తులు, భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
