
న్యూఢిల్లీ: బాబా రామ్ దేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద్ తమ హోమ్, పర్సనల్ కేర్ బిజినెస్‌లను లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్‌కు రూ.1,100 కోట్లకు అమ్మాలని నిర్ణయించుకుంది. వంటనూనెలను అమ్ముతున్న పతంజలి ఫుడ్స్ తాజా అక్విజేషన్‌తో పూర్తి స్థాయి ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా మారనుంది. పతంజలి ఆయుర్వేద్ ఆపరేట్ చేస్తున్న హెయిర్ కేర్, స్కిన్ కేర్, డెంటల్ కేర్, హోమ్ కేర్ బిజినెస్‌లను కొనుగోలు చేసేందుకు పతంజలి ఫుడ్స్ బోర్డు ఆమోదం తెలిపింది.