
షారూఖ్ ఖాన్ పఠాన్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రెండు రోజుల్లోనే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.106 కోట్లు, సెకండ్ డే రూ.113 కోట్లు, మొత్తంగా రూ. 219 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
రెండు రోజుల్లో ఒక్క హిందీ వర్షన్ లో ఈ మూవీ రూ.123 కోట్లు కొల్లగొట్టింది. మొదటి రోజు రూ.55 కోట్లు, రెండో రోజు 68 కోట్లు వసూలు చేసింది. తమిళ్, తెలుగు వర్షన్ లో రెండు రోజుల్లో రూ.4.5 కోట్లు వచ్చాయి. ఇక ఓపెనింగ్ రోజే హిందీలో రూ.55 కోట్లు సాధించి కేజీఎఫ్ 2 ను దాటేసింది. తొలి రోజు కేజీఎఫ్-2 హిందీ వర్షన్ రూ. 53.95 కోట్లు రాబట్టింది.