
పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది. కొత్తవాళ్లతో ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే మా చిత్రానికి కథే హీరో.
సినిమా చూస్తున్నంత సేపు పతంగుల పోటీ అందరిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో మరింత పాజిటివ్ వైబ్స్‌ను కలిగేలా చేస్తాం’ అని చెప్పారు.