ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ..ఊపిరాడక పేషెంట్ మృతి

ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ..ఊపిరాడక పేషెంట్ మృతి

గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ సి లిం డర్ లీ కేజీ కావడం ఒక పేషెంట్ మరణానికి కారణ మైంది. హాస్పి టల్ లోని చిల్డ్రన్స్ వార్డులో సోమవారం ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయి పేలిపో యింది. పేలుడు శబ్దం రావడంతోపాటు పొగ వ్యాపించడంతో పేషెంట్లు బయటకు పరుగు పెట్టారు. షుగర్ లెవెల్స్ పడిపోయి వెంటిలెటర్ మీద చికిత్స పొందుతున్న శెట్టి ఆత్మకూరు కు చెందిన కృష్ణయ్య ఊపిరాడక చనిపోయాడు. సోమవారం ఉదయం చిల్డ్రన్స్ వార్డులో అనుకోకుండా ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావడంతో పొగ కమ్ముకు న్నది. చిల్డ్రన్స్ వార్డులో ఉన్న 10 మంది పిల్లలను సంకనెత్తుకుని బయటకు పరుగులు తీశారు. కాజువాలిటీ వార్డులో ఉన్నవారు, బాలింతలు కూడా భయంతో బయటకు పరుగు పెట్టారు. వెంటిలేటర్ మీద ఉన్న కృష్ణయ్యను కూడా బయటకు తీసుకురావడంతో ఊపిరాడక చనిపోయాడు. సిలిం డర్ ఫ్లోమీటర్ వ్యాల్యూ నుండి సడన్ గా ఆక్సిజన్ రిలీజ్ అయ్యిం దని, ఆ టైమ్ లో శబ్దం రావడంతో పేషెంట్లు బయటకు వచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి తెలిపారు. కృష్ణయ్య సెప్టిక్ షాక్ వల్ల చనిపోయారని, ఊపిరాడక కాదని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దని మాజీ మంత్రి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్ రేట్ లో రైతుల ఆత్మ హత్యాయత్నం