ఆన్​లైన్​లో కన్సల్టేషన్​కే ఎక్కువ ప్రిఫరెన్స్

ఆన్​లైన్​లో కన్సల్టేషన్​కే ఎక్కువ ప్రిఫరెన్స్
  • వీడియో ద్వారా డాక్టర్ కన్సల్టేషన్​ తీసుకుంటున్నరు 
  • క్లినిక్ నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల వరకు ఫెసిలిటీ 
  • అపాయింట్​మెంట్​ బుకింగ్, స్లాట్స్ కన్ఫర్మ్​

“మధురానగర్​కు చెందిన శైలజ ప్రైవేట్ ఎంప్లాయ్. కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పి, జ్వరం ఉండగా,  కరోనా టెస్ట్ కు వెళ్లేందుకు డాక్టర్​ను కన్సల్ట్ ​కావాలనుకుంది. ఆస్పత్రికి వెళ్లకుండా ఆన్​లైన్​లోనే అపాయింట్​మెంట్​తీసుకుని వీడియో కన్సల్టేషన్​లో డాక్టర్​కు తన హెల్త్ ​ప్రాబ్లమ్స్ ​చెప్పింది. మైల్డ్ సింప్టమ్స్​​గా గుర్తించి మెడిసిన్​ సూచించారు.”

“కేపీహెచ్‌‌బీలో ఉండే 50 ఏండ్ల మహిళ గొంతులో నొప్పి, విరేచనాలు, జ్వరంగా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఆన్​లైన్​లో పల్మనాలజిస్ట్​ను కన్సల్ట్​ అయ్యింది. తన హెల్త్ ఇష్యూస్​ను చెప్పుకుంది. పేషెంట్​ను హాస్పిటల్​కి తీసుకురమ్మని, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ నైనా​మెడికల్ రిపోర్ట్స్ తో రావాలని డాక్టర్​ సూచించారు. ఆమెకు కావాల్సిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తగు జాగ్రత్తలు సూచించారు.” 

హైదరాబాద్, వెలుగు: ఫీవర్, కోల్డ్, తలనొప్పి.. ఇలా ఏదైనా హెల్త్​ప్రాబ్లమ్​అనిపించినా ఆస్పత్రికి వెళ్లకుండానే ఆన్​లైన్​లో డాక్టర్​ను  కాంటాక్ట్ అయ్యేందుకే చాలా మంది ఇంట్రెస్ట్​చూపిస్తున్నారు. ఆన్​లైన్​ కన్సల్టేషన్​ తీసుకునేవారు ఎక్కువైతున్నారు. ఏ మాత్రం హెల్త్​ ప్రాబ్లమ్​ అనిపించినా వెంటనే డాక్టర్​ని కాంటాక్ట్​ అవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాన్ని సీజనల్ ఫ్లూగా చూసిన వారు ఇప్పుడు కరోనా వైరస్ అనుకుని టెన్షన్​పడుతున్నారు. క్లినిక్ వెళ్లాలన్నా ఆలోచిస్తూ ఆన్​లైన్​లోనే   వీడియో కన్సల్టేషన్​ తీసుకుంటున్నారు.ఇలా ఒక్కో డాక్టర్ వద్ద రోజుకు పదికి పైగా స్లాట్స్ బుక్​​అవుతున్నాయి.    పల్మనాలజిస్ట్‌‌లు, జనరల్ ఫిజిషియన్లు, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్లు యాప్‌‌లు, ఆన్​లైన్​ సైట్లలో అందుబాటులో ఉంటున్నారు. క్లినిక్ నుంచి కార్పొరేట్​ఆస్పత్రి డాక్టర్ల వరకు ఈ -పోర్టల్ లో మెడికల్ ​చెకప్​ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. 

ఆన్​లైన్​లోనే అన్ని వివరాలు..
వందమంది పేషెంట్లలో దాదాపు 30 మంది వీడియో కన్సల్టెన్సీకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు.  ఆన్​లైన్​ట్రీట్​మెంట్​కోసం డాక్టర్లు యాప్ లలో, ప్రాక్టో డాట్ కామ్ వంటి  సైట్లలో ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకుంటు న్నారు. ఎక్స్‌‌పీరియన్స్, స్పెషలైజేషన్ మెన్షన్ చేస్తున్నారు. రూ. 500  నుంచి వెయ్యి వరకు కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటు న్నారు. అపాయింట్​మెంట్​బుక్ చేసుకునేందుకు ఆప్షన్ తో పాటు ఎన్ని స్లాట్స్ అందుబాటులో ఉన్నాయో అప్ డేట్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్స్ లో డ్యూటీ చేస్తూ సాయంత్రం వీడియో కన్సల్టేషన్ ద్వారా మెడిసిన్​ రిఫర్​ చేస్తున్నారు. ఆన్​లైన్​లో ట్రీట్​మెంట్​ చేసే డాక్టర్ల బిహేవియర్, ట్రీట్​మెంట్​, హెల్త్ ఇష్యూను పరిష్కరించే విధానంపై పేషెంట్లు రేటింగ్​, కామెంట్లు రూపంలో మెన్షన్ చేస్తున్నారు.

ట్యాబ్లెట్స్​ వేసుకున్నా తగ్గకుంటే
లైట్​ ఫీవర్, గొంతులో దురద, తలనొప్పి ఉంటుండగా రెండు రోజులు ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు. హాస్పిటల్​కు చెకప్ కోసం వెళ్దామనుకున్నా. బయటకు వెళ్లి రిస్క్​చేయడమెందుకని ఆన్​లైన్​లోనే డాక్టర్  కన్సల్టేషన్ ​తీసుకున్నా. పది నిమిషాలు వీడియో కన్సల్టేషన్​లో నా హెల్త్​ప్రాబ్లమ్​చెప్పాను. డాక్టర్ సూచించిన మెడిసిన్​ వేసుకున్నాక క్యూర్​ అయింది. 
- దివ్యశ్రీ, ప్రైవేటు ఎంప్లాయ్, యూసఫ్​గూడ

పేషెంట్​ కండీషన్​ తెలుసుకుని..
ప్రస్తుతం ఓపీ కంటే ఆన్​లైన్​లో​ కన్స​ల్టేషన్​ తీసుకునే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. వీడియో కన్సల్టేషన్​లో ట్రీట్ చేస్తున్న పేషెంట్లలో ఎక్కువగా గొంతు నొప్పి ప్రాబ్లమ్ పైనే చెబుతు న్నారు. వీడియో కాల్ ద్వారా పేషెంట్ కండిషన్ తెలుసుకుని మెడిసిన్​ సూచి స్తున్నాం. ఎమర్జెన్సీ అయితే కచ్చి తంగా హాస్పిటల్ కి రావాలని చెబు తున్నాం. రాలేని పరిస్థితిలో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పేషెంట్​ మెడికల్ రిపోర్ట్స్ తెప్పించు కుంటున్నాం. కండీషన్​ను బట్టి ట్రీట్​మెంట్ ​కంటిన్యూ చేస్తున్నాం.
- డాక్టర్ ఎస్‌‌ఏ రఫీ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, బంజారాహిల్స్​