
అమెరికాలో H1B వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కంపెనీలు ప్రతి ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై అమెరికా కార్మిక శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ ఫైర్వాల్ను అమెరికాలో అమల్లోకి తెస్తున్నామని.. H1B వీసాపై తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా అందులో భాగమేనని అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది.
H1B వీసా దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసి.. నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు మాత్రమే కంపెనీలు ప్రియారిటీ ఇవ్వాలనే లక్ష్యంతో H1B వీసా అప్లికేషన్లపై లక్ష డాలర్ల ఫీజు ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా కార్మిక శాఖ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. H1B వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్లు ఇన్నాళ్లూ మట్టి కొట్టుకుపోయారని, ఇకపై నైపుణ్యం కలిగిన అమెరికన్లకు ఆ పరిస్థితి ఎదురవదని అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ చెప్పుకొచ్చారు.
Also Read:-ట్రంప్ H-1B వీసా ఫీజు రూల్స్.. సోమవారం TCS, Wipro లాంటి టెక్ స్టాక్స్ పరిస్థితి ఏంటి..?
అమెరికా కార్మిక శాఖ చెబుతున్న ఈ ప్రాజెక్ట్ ఫైర్వాల్ (Project Firewall) అంటే ఏంటంటే.. అమెరికాలో హై స్కిల్డ్ జాబ్స్ అమెరికన్లకే దక్కాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న ప్లాన్ ఈ Project Firewall. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ కంపెనీలు.. మరీ ముఖ్యంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల నియామకాల్లో అర్హత కలిగిన అమెరికన్లకు ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో Project Firewall అనే ప్లాన్ను అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా.. H1B వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిపై అమెరికా అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది. H1B వీసా దుర్వినియోగాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ఫస్ట్ టైం కార్మిక శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా H1B వీసా ప్రక్రియను పరిశీలించనున్నారు.
H1B వీసా దరఖాస్తు సమయంలో గానీ, ఉద్యోగిని నియమించుకున్న సందర్భంలో గానీ.. ఏవైనా అవకతవకలు జరిగాయని తేలితే సదరు కంపెనీపై, ఉద్యోగిపై భారీ జరిమానాను విధించడంతో పాటు H1B వీసాపై నిషేధం విధించాలనే ఉద్దేశంతో.. తద్వారా అమెరికాలో నైపుణ్యం కలిగిన స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా అమెరికా కార్మిక శాఖ ఈ ప్రాజెక్ట్ ఫైర్వాల్కు శ్రీకారం చుట్టింది. ఫలితంగానే.. తాజాగా H1B వీసాపై ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
The days of employers abusing H-1B Visas are over.
— U.S. Department of Labor (@USDOL) September 19, 2025
Introducing PROJECT FIREWALL—our plan to ensure high-skilled jobs go to AMERICANS FIRST 🇺🇸 pic.twitter.com/XPwBJSZfto