న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో పట్నా పైరేట్స్ కీలక విజయం సాధించింది. టేబుల్ టాపర్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు షాకిచ్చి నాలుగో ప్లేస్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 36–33తో జైపూర్‌ను ఓడించింది. కెప్టెన్ సచిన్, సుధాకర్ చెరో పది పాయింట్లతో పట్నాను గెలిపించారు.
డిఫెండర్ క్రిషన్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. జైపూర్ జట్టులో అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. దబాంగ్ ఢిల్లీ కేసీ, పుణెరి పల్టన్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30తో టై అయింది. ఈ ఫలితంతో పుణెరి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయింది.
