రేవంత్‌పై కామెంట్లు చేస్తవా?.. కౌశిక్ నువ్వు శ్రీరెడ్డివా?

రేవంత్‌పై కామెంట్లు చేస్తవా?.. కౌశిక్ నువ్వు శ్రీరెడ్డివా?

కరీంనగర్: కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ కిసాన సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణా రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి గత మూడు నెలలుగా టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యాడని తాను చెబుతూ వచ్చాయని, తాజాగా ఈ విషయం బయటపడిందని కృ‌ష్ణా రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కౌశిక్‌కు లేదని మండిపడ్డారు. అన్నం పెట్టిన కాంగ్రెస్‌ను తిడతావా అంటూ ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్‌తో మంతనాలు జరిపిన ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్ ఎక్కడ బహిష్కరిస్తుందోనని భయపడి పార్టీకి రాజీనామా చేశాడని కౌశిక్‌ను దుయ్యబట్టారు. 

‘కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌‌తో కుమ్ముక్కయ్యాడని మూడు నెలలుగా నేను చెబుతూనే ఉన్నా. అది నిన్న బయటపడింది. పెప్పర్ స్ప్రే దాడులకు వెరవకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్ విషయంలో కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నడు. బాధ్యతలు తీసుకున్న ఐదు రోజుల్లో రేవంత్ రెడ్డి పార్టీకి ఏం నష్టం చేశాడో కౌశిక్ చెప్పాలి’ అని కృష్ణా రెడ్డి ప్రశ్నించారు.

‘ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరేళ్లుగా కాంగ్రెస్‌కు చేసిన నష్టం కంటే రేవంత్ ఎక్కువ చేశాడా? రేవంత్ రాకతో కాంగ్రెస్ కొత్త ఊపిరి పోసుకుంటుంటే నష్టం కలిగించాడంటావా? ముమైత్ ఖాన్‌‌తో రేవంత్ రెడ్డిన పోల్చిన కౌశిక్ నువ్వు శ్రీరెడ్డివా? హైదరాబాద్‌‌లోని అత్తాపూర్, తిరుమలాపూర్‌‌లో పెట్రోల్ బంకులను ప్రభుత్వం దగ్గర అద్దెకు తీసుకుని వాటి అద్దె కౌశిక్ చెల్లించడం లేదు. మరో చోట 25 గుంటలు ఆక్రమించుకుని కౌశిక్ రెడ్డి డాగ్ ఫామ్ నడిపిస్తున్నాడు. అన్నం పెట్టిన కాంగ్రెస్ ను దూషిస్తావా? రేవంత్, పొన్నం ప్రభాకర్ గురించి మళ్లీ మాట్లాడితే వీపు పగలగొడతాం’ అని కృష్ణా రెడ్డి హెచ్చరించారు.