
బషీర్బాగ్, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిమానులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఐమాక్స్ థియేటర్లో గొడవపడ్డారు. యాత్ర 2 సినిమా మధ్యలో కొంత మంది జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేయడంతో జగన్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.
వారు కూడా జై జగన్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో థియేటర్ లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఐమాక్స్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టి థియేటర్ నుంచి బయటకు పంపించారు.