
అన్నపూర్ణ స్టూడియోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరుగుతున్నాయి. షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరూ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటుగా ఇద్దరు భేటీ అవ్వగా... ఏపీ రాజకీయాల గురించే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. అటు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా రానున్నారు. ఈనెల 27న దీనికి సంబంధించిన షూటింగ్ జరగనుందని సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా కిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ఎం రత్నం ఈ మూవీని నర్మిస్తుండగా, కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అటు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే మూవీని చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.