
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OG మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా మొదలైంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్ర ప్రారంభోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, అల్లు అరవింద్, దిల్‌రాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నట్లుగా అధికారికంగా తెలిసిపోయింది. సుజిత్‌తో దిగిన ఓ ఫొటోని తమన్ షేర్ చేస్తూ.. ‘‘మేము మొదలుపెట్టేశాం’’ అని చెప్పాడు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు తమన్ మ్యూజిక్ అందించాడు.