నేను ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా.. పవన్ ట్వీట్

నేను ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా.. పవన్ ట్వీట్

ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేనాని ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన చైతన్య రథానికి వేసిన ఆలీవ్ గ్రీన్ కలర్ పై వైసీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి కౌంటర్‭గా పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ఆలీవ్ గ్రీన్ కలర్‭తో ఉన్న షర్ట్‭ను ట్వీట్ చేస్తూ.. ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్‭లో పోస్టు పెట్టారు. ముందు నా సినిమాలను అడ్డుకున్నారు. తరువాత విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా తన కారును అడ్డగించారని వైసీపీ పై పవన్ విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్నికల కోసం సిద్ధం చేసిన వాహనం రంగు మీకు సమస్యగా మారిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనే ట్యాగ్‭తో పవన్ ఏర్పాటు చేసిన చైతన్య రథం హాట్ టాపిక్‭గా మారింది. ఆ వాహనానికి వేసిన ఆలీవ్ గ్రీన్ కలర్ పై వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. మిలిటరీ వాళ్లు తప్ప ప్రైవేట్ వ్యక్తులు తమ వెహికల్స్‌కి అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిషేదం.. అలాంటిది జనసేన వాహనానికి ఆ రంగు వేస్తే ఎలా అనుమతి వస్తుందని వైసీపీ ఆరోపించింది. ఆ వాహనానికి పసుపు రంగు వేసుకుంటే మంచిదని సెటైర్లు వేశారు. దీనిపై స్పందించిన పవన్ షర్ట్ వేసుకోవడానికి అయినా అనుమతి ఇస్తారా అంటూ కౌంటర్ వేశారు.