పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ కాంబో.. నిర్మాతగా గురూజీ

పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ కాంబో.. నిర్మాతగా గురూజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Powerstar Pawan kalyan) కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా వరుస సినిమాలను ఒకే చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో సుజిత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఓజీ, క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి తో మరో మూవీ చేస్తున్నాడు. ఇక తాజా సమాచారం మేరకు మరి స్టార్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారట పవన్ కళ్యాణ్. 

ఈ ప్రాజెక్టు కోసం క్రేజీ కాంబో సెట్ కానుంది. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నారట. ఇటీవలే షారుఖ్ ఖాన్ తో  జవాన్ సినిమా చేసి రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు ఈ దర్శకుడు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే.. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ భారీ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు ల;లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తాడని సమాచారం. దీంతో ఈ సినిమాపై ఆసక్తినెలకొంది. అయితే ఈ ప్రాజెక్టు ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం రాజకీయాల కారణంగా షూటింగ్స్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే.. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్. అనంతరం అట్లీ, త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడట. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.