
నలుగురికీ న్యాయం చేసే ‘వకీల్ సాబ్’గా నల్లకోటులో మెప్పించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు లాఠీ పట్టుకుని, ఖాకీ చొక్కా వేసుకుని పోలీసు పాత్రకి షిఫ్టయ్యారు. గతంలో ఇదే ఖాకీ డ్రెస్‌లో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. ఈసారి భీమ్లా నాయక్‌గా రాబోతున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మలయాళంలో మెప్పించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మి
స్తోంది. ఈ సినిమాకి సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది టీమ్. మొన్న పవన్ క్యారెక్టర్‌ని పరిచయం చేశారు. నిన్న మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సీన్స్ తీస్తున్నారు. కాప్ గెటప్‌లో ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. తనని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను రానా పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఇగో క్లాషెసే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. రెండు క్యారెక్టర్స్ పోటాపోటీగా ఉండనున్నాయి. ఇక సెట్‌లో దర్శకుడు సాగర్ చంద్రతో పాటు త్రివిక్రమ్ కూడా కనిపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే పవన్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ఎ.ఎం.రత్నం ఇప్పటికే ప్రకటించారు. అదే సమయానికి ఈ సినిమాని తీసుకొస్తామంటున్నారు. మరి ‘వీరమల్లు’ వాయిదా పడుతుందా లేక ఇంకా ముందే రానుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏదేమైనా సంక్రాంతి బరిలోకి పవన్ రావడమనేది మాత్రం కన్‌ఫర్మ్.