హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు..

హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా గురువారం ( జులై 24 ) విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో నెలకొన్నాయి. ఈ క్రమంలో బుధవారం ఈ సినిమాకు ప్రీమియర్ షోలు నిర్వహించారు మేకర్స్. మచిలీపట్నంలో హరిహర వీరమల్లు ప్రీమియర్ షో ఉద్రిక్తతకు దారి తీసింది. మచిలీపట్నంలోని రేవతి థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

ఈ సినిమా ప్రీమియర్ షోలకు పరిమితికి మించి అనుమతి ఇవ్వడం ఉద్రిక్తతకు దారి తీసినట్లు తెలుస్తోంది. థియేటర్ దగ్గరకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రెచ్చిపోయారు ఫ్యాన్స్. ఒకరిపై ఒకరు వాటర్ క్యాన్లు విసురుకుంటూ హల చల్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీంతో సహనం నశించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లాఠీఛార్జ్ చేసి ఫ్యాన్స్ ను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇవాళ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ పెయిడ్ ప్రీమియర్స్‌ను బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో వేశారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్‌లో VFX అస్సలు బాలేదని.. అవి ప్రేక్షకుల్ని డిస్సప్పాయింట్ చేసేలా ఉందని అంటున్నారు. ఓవరాల్గా ఫస్టాఫ్ 40 నిమిషాలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, కీరవాణి మ్యూజిక్ సినిమాని నిలబెట్టేలా ఉన్నాయని రివ్యూలు ఇస్తున్నారు.